
సివిల్స్ కోచింగ్ వినియోగించుకోండి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిర్వహించే సివిల్స్ కోచింగ్‌ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ సునీత అన్నారు. సోమవారం ఆ శాఖ కార్యాలయంలో సివిల్స్ కోచింగ్‌కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఎస్సీ డీడీ ఉప సంచాలకులు, ఎస్సీ స్టడీ సర్కిల్, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నందు 2025– 26 సంవత్సరానికి గాను 10 నెలల సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహిస్తారన్నారు. ఈ శిక్షణకు గాను ఉమ్మడి జిల్లాలో అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వచ్చే నెల 7లోగా http://tsstudycircle.co.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 040– 23546552, 81216 26423 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూ సుదర్శన్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్, కన్యాకుమారి, వార్డెన్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.