సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
పాన్‌గల్: వర్షాకాలం ప్రారంభమైనందున సిబ్బంది సీజనల్‌గా వచ్చే వ్యాధులతో అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యం చేయాలని జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. సాయినాథ్‌రెడ్డి అన్నారు. ఫ్రై డే.. డ్రై డేలో భాగంగా శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి నిల్వలు, అపరిశుభ్రతతో దోమలు వృద్ధి చెంది రోగాలు వ్యాప్తి చెందుతాయని.. రోగాల బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, వైద్యసిబ్బంది రాంచందర్, నర్సమ్మ, నాగేశ్వరి, శైలజ, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


