ఆఽధిక్యం ఉన్నా.. అసంతృప్తి
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. ముందస్తు ప్రణాళికలకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయనే చర్చ పల్లెసీమల్లో వినిపిస్తోంది. ఇందుకు కారణం 90 శాతం స్థానాలు తమవే అనుకున్న అఽధికార పార్టీ 54.85 శాతం స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్‌ఎస్‌తో బీజేపీ లోపాయికారిగా జతకట్టి అవసరమైన వారికి మద్దతిస్తూ మరికొన్నిచోట్ల మద్దతు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు కోల్పోలేదనే అంశాన్ని చాటుకుంది.
వనపర్తితో పాటు ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట, దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపురం మండలాల్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే తక్కువ స్థానాల్లో గెలుపొందడం శోచనీయం. ఇందుకు నేతల ప్రసంగాలే కారణంగా అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పట్టు కోల్పోయిన అధికారపార్టీ..
జిల్లాలోని గోపాల్‌పేట, పాన్‌గల్, చిన్నంబావి మండల కేంద్రాల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలు మినహా.. మిగతా ప్రాంతాల్లోని ప్రధాన గ్రామాల్లో అఽధికార పార్టీ పట్టు సడలినట్లు గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోంది.
12 మండలాల్లో కాంగ్రెస్..
మూడింటిలో బీఆర్‌ఎస్ ఆధిక్యం
3 మండల కేంద్రాలు, ప్రధాన
గ్రామాల్లో పట్టుకోల్పోయిన
అధికార పక్షం


