
పడకేసిన పల్లె పాలన
గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువు
●
పనిభారం.. నిధులు కరువు...
పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దీంతో గ్రామంలో కనీస మౌలిక వసతుల కల్పనకు తప్పనిసరిగా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీటి బోర్ల మరమ్మతులకు పంచాయతీ ఖాతాల్లో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను ప్రత్యేక అధికారులకు విన్నవిస్తున్నా.. నిధులు లేక పరిష్కరించలేక పోతున్నాం.
– రాజీక్, పంచాయతీ కార్యదర్శి.
మోట్లంపల్లి (ఆత్మకూర్)
నిధులు మంజూరైతేనే..
గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరాలి. ఇందుకుగాను పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరగాలి. ప్రభుత్వం త్వరలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 15 ఆర్థిక సంఘం నిధులు మంజూరుగాకపోవడంతో చిన్న పంచాయతీల్లో నిర్వహణ భారంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. – సురేష్‌కుమార్,
జిల్లా పంచాయతీ అధికారి
అమరచింత: సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తుండటం.. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులపైనే పనిభారం పెరగడం.. 15 ఆర్థిక సంఘం నిధులు మంజూరుగాక కార్మికులకు ప్రతి నెలా వేతనాలు అందకపోవడం తదితర కారణాలతో గ్రామాల్లో పాలన పడకేసింది. గతేడాది జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగియగా.. ప్రభుత్వం ఫిబ్రవరి 1న క్లస్టర్ గ్రామాలు ఎంపికచేసి జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. వారికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం నిధులు, విధులపై స్పష్టత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండటంతో కనీసం వీధిదీపాలు, బోర్ల మరమ్మతులు, గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీల్లో విధులు నిర్వర్తించే మల్టీపర్పస్ వర్కర్స్‌కు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి తలెత్తింది.
పనిభారంతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులు
చెత్త సేకరణ వాహనాలకు డీజిల్, బోర్ల మరమ్మతుకు నిధుల లేమి
జిల్లాలో 255 గ్రామపంచాయతీలు

పడకేసిన పల్లె పాలన

పడకేసిన పల్లె పాలన

పడకేసిన పల్లె పాలన