
తాగుతూ.. ఊగుతూ...!
నిబంధనలు పాటించని మద్యం దుకాణాదారులు
బార్లకు మించి
పర్మిట్ రూములు..
మద్యం దుకాణాల నిర్వాహకులు ఎకై ్సజ్‌శాఖ ఇచ్చే టార్గెట్లను ఆసరాగా చేసుకొని పరిమిత కొలతలతో ఇచ్చే పర్మిట్ రూములను పెద్దగా నిర్మించుకొని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మద్యం విక్రయాల టార్గెట్‌ను చేరుకునేందుకు అక్రమ సిట్టింగ్‌లను సైతం ఎకై ్సజ్‌శాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని శ్రీరామా టాకీస్ సమీపంలో ఉన్న బార్ పురాతన ఆలయం సమీపంలో ఉండటం.. ప్రతి సోమ, శనివారం ఆలయానికి వెళ్లే భక్తులు అటుగా రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు పలుమార్లు ఎకై ్సజ్‌శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది.
● కొత్తకోటలో కర్నూలు రోడ్ వైపు ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద సాయంత్రం 7.30 దాటితే రోడ్డు పక్కన మూసి ఉన్న దుకాణాల ఎదుట మద్యం తాగేవారు అత్యధికంగా కనిపిస్తారు. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మున్సిపాలిటీల్లో శివారు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా మద్యం తాగేవారు కనిపించడం సర్వసాధారణమైంది.
వనపర్తి: జిల్లాకేంద్రం శివారులోని దాబాలు, హోటళ్లతో పాటు ఇళ్ల నడుమ ఉన్న పలు హోటళ్లు సైతం బార్లను తలపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలోని కొత్తకోట రహదారిలో ఉన్న ఓ హోటల్లో అర్ధరాత్రి మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్రంలోని పలు హోటళ్లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు మాత్రం జోక్యం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలుమార్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు అందినా ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో సిట్టింగ్‌ల పర్వం రోజురోజుకు పెరుగుతోంది.
జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో ఉన్న ఓ మద్యం దుకాణం ఎదుట కనిపించిన చిత్రమిది. రోడ్డుపై వాహనాలు, రోడ్డు పక్కన పాదచారులు వెళ్తున్నా.. మందు బాబులు దుకాణం ముందే మద్యం తాగుతూ కనిపించారు. అనుమతికి మించి ఎక్కువ గదుల్లో సెట్టింగ్‌లు ఏర్పాటు చేసుకున్నా.. రోడ్లపై అందరూ చూస్తుండగానే మద్యం తాగుతున్నారు. వారాంతపు సంత రోజు పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం ఏదో ఒక ఘర్షణ చూడాల్సి వస్తోందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు.
దుకాణాల ఎదుట మద్యం తాగుతున్న మందుబాబులు
ఇళ్ల మధ్య హోటళ్ల పేరుతో అనధికార సిట్టింగ్‌లు
రోజుకో లొల్లి.. పట్టించుకోని అధికారులు
విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

తాగుతూ.. ఊగుతూ...!

తాగుతూ.. ఊగుతూ...!