ఏడీఏలకు డీడీలుగా పదోన్నతిపై బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఏడీఏలకు డీడీలుగా పదోన్నతిపై బదిలీ

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

ఏడీఏలకు డీడీలుగా పదోన్నతిపై బదిలీ నిషేధిత విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చర్యలు ● వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయ ఏడీ ఆర్‌.శశిధర్‌రెడ్డి ఆర్టీసీ బస్సులో గలాటా

విజయనగరం ఫోర్ట్‌: వ్యవసాయ శాఖలో సహా య సంచాలకులుగా (ఏడీఏ) పనిచేస్తున్న నలుగురికి డీడీ(ఉప సంచాలకులు)గా పదోన్న తి లభించింది. విజయనగరం సబ్‌ డివిజన్‌ ఏడీఏ నాగభూషణంకు డీడీగా కృష్ణా జిల్లాకు పదోన్నతిపై బదిలీ అయింది. ప్రకృతి వ్యవసా య విభాగం ప్రాజెక్టు మేనేజర్‌ ఆనంద్‌రావుకు గుంటూరు కమిషనర్‌ కార్యాలయంకు డీడీగా పదోన్నతిపై బదిలీ అయింది. జిల్లా వ్యవసా య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్‌.శ్రీనివాసరావుకు డీడీగా శ్రీకాకుళం పదోన్నతి పై బదిలీ అయింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏడీఏగా పనిచేస్తున్న మహారాజన్‌కు విజయనగరం ఆత్మ (వ్యవసాయ యాజమా న్య సాంకేతిక సంస్థ) డీపీడీగా పదోన్నతిపై బదిలీ అయింది. శ్రీకాకుళం నుంచి ఎం.రామారావు డీడీగా విజయనగరం వస్తున్నారు.

రామభద్రపురం: నిషేధిత విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.శశిధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయ ఏడీఏ కె.ఆంజనేయకుమార్‌తో కలిసి గురువారం పురుగు మందులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులతో పాటు నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తే దుకాణ లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. రూ.లక్ష జరిమానాతో పాటు సంబంధిత దుకాణ యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు.హెచ్‌టీ రకం వంటి నిసేధిత పత్తి విత్తనాలు ఏ రైతు నాటినా ఆ రైతు పంట నష్టపోయినా పంట నష్టం బీమా వర్తించదని, వారు బీమాకు అనర్హులవుతారన్నారు. ప్రస్తుతం దేశంలో బీటీ పత్తి విత్తనాలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. రైతులు లైసెన్స్‌ ఉన్న దుకాణాలలో విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి బిల్లులు పొందాలని సూచించారు. ఏఓ ఎం.శివ, విస్తరణాధికారి జి.శరత్‌ పాల్గొన్నారు.

బొబ్బిలి: దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల పండగకు మేనమామ ఇంటికి వచ్చిన ఓ బాలి క తిరుగు ప్రయాణంలో బస్సులో మహిళల మధ్య జరిగిన గొడవలో దాడికి గురై తీవ్ర అస్వస్థత పాలైంది. దీంతో స్థానికులు బాలిక ను సీహెచ్‌సీకి 108లో తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగ రం కేంద్రాస్పత్రికి తరలించారు. వివరాలు.. విశాఖకు చెందిన బెజ్జుపల్లి భార్గవి(14) తల్లి దండ్రులతో కలసి బొబ్బిలిలోని గొల్లవీధిలోని తన మేనమాన ఇంటికి పండగల నిమిత్తం వచ్చింది. పండగ పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం తిరిగి విశాఖ వెళ్లేందు కు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లి తల్లిదండ్రులు, తమ్ముడితో కలసి ఆర్టీసీ బస్‌ ఎక్కింది. ఈ సమయంలో సీట్ల కోసం పడుతున్న ఆదుర్దాలో మరో మహిళకు భార్గవి కాలు తగిలింది. దీంతో ఆమె కోపోద్రిక్తురాలై గొడవ పడింది. ఈ గొడవ రెండు సమూహాల మధ్య గొడవగా మారి తోసుకున్నారు. ఈ క్రమంలోనే భార్గవిపై ఓ మహిళ పిడిగుద్దులు కురిపించిందనీ, దీంతో బాలిక కిందపడటంతో పలువురు మీది నుంచి వెళ్లిపోయారని బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరాడని పరిస్థితుల్లో 108 ద్వారా స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఏఎస్సై సన్యాసిరావు వెళ్లి వివరాలు సేకరించారు. బాలికను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారని భార్గవి బంధువులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement