దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాలి

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

విజయనగరం గంటస్తంభం: దళితుల్లోని క్రైస్తవుల హక్కులను కాపాడాలని అంబేడ్కర్‌ రైట్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై రూపొందించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్‌లో ఉన్న అంబేడ్కర్‌ సామాజిక భవనంలో ఆదివారం ఆవిష్కరించారు. క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఆర్టికల్‌ 15, 17, 25, 26ల ప్రకారం సమానత్వం, మతస్వేచ్ఛ హక్కులు ఉన్నప్పటికీ ఈ తీర్పుతో దళిత క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత క్రిస్టియన్ల పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్‌ కేజీ బాలకృష్ణ కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయాలని పట్టుబట్టారు.కార్యక్రమంలో డి.వెంకటేష్‌, వి.వంశీ, సయ్యద్‌ ఇఫ్రాన్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement