జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను కొనసాగిద్దాం..: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను కొనసాగిద్దాం..: కలెక్టర్‌

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను కొనసాగిద్దాం..: కలెక్టర్‌

విజయనగరం అర్బన్‌: బడుగు బలహీన వర్గాల నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ 119వ జయంతిని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొని జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల విద్యార్థులు జగ్జీవన్‌రామ్‌ జీవిత విశేషాలు, ఆయన సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రద ర్శించారు. కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి మాట్లా డుతూ రిజర్వేషన్‌ ఫలాలు అనుభవించి ఉన్నత స్థాయికి చేరిన బడుగు వర్గాలకు చెందిన అధికారు లు, ఉద్యోగులంతా తమ తోటి పేద కుటుంబాల వారికి చేయూతనిచ్చి వారు కూడా ఉన్నతస్థాయికి చేరుకునేలా సహాయం అందించిన నాడే డాక్టర్‌ జగ్జీవన్‌రామ్‌కు సరైన నివాళి కాగలదన్నారు. ఆయన కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, దేశానికి ఆహార భద్రతను అందించిన హరిత విప్లవ సారధి అన్నారు. బడుగువర్గాల వారు విద్యతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం పొందగలుగుతార ని ఈ విషయాన్ని గుర్తించి విద్యతో ఉన్నత శిఖరాలను చేరే ప్రయత్నాలు చేయాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌, సాంఘిక సంక్షేమ డీడీ అన్నపూర్ణమ్మ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ ఏఓ దేవిప్రసాద్‌, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement