రాజాం సిటీ: జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీలో రెండు రోజులుగా నిర్వహించిన ఏపీ స్టేట్ జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ఎనిమిది కేటగిరీల్లో మహిళలు, పురుషులు వేర్వేరుగా తలపడ్డారు. మహిళల సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో...అలాగే పురుషుల జూనియర్ విభాగంలో విజయనగరం క్రీడాకారులు విజేతలుగా నిలిచి ఓవరాల్ చాంపియన్‌షిప్ దక్కించుకున్నారని వీసీ డాక్టర్ జె.గిరీష్ తెలిపారు. ఈ ఎనిమిది కేటగిరీల్లో ప్రథమ స్థానం పొందిన క్రీడాకారులు వచ్చే నెల 15 నుంచి 20 వరకు అమలాపురంలో జరగనున్న జాతీయస్థాయి క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
విజేతలు ..
జూనియర్ విభాగంలో..
రెండో రోజు వివిధ కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో పురుషులు తమ పవర్ చూపించారు. 53 కిలోల విభాగంలో వి.శరత్ (విజయనగరం), టి.అభిశంకర్ (శ్రీకాకుళం), ఎం.రేవంత్ (కృష్ణా ) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే 59 కిలోల విభాగంలో వై.భరత్ (విశాఖ), ఎ.యశోధర్ (బాపట్ల), సీహెచ్. శ్రీరామ్ (కోనసీమ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. 66 కిలోల విభాగంలో ఎన్.కార్తికేయ (విశాఖ), పి.అఖిల్ (పార్వతీపురం మన్యం), ఐ.ప్రవీణ్‌కుమార్ (అనకాపల్లి).. 74 కిలోల విభాగంలో జె.లవకుమార్ ( అనకాపల్లి), బి.అంజినా సంపత్ (శ్రీకాకుళం), బి.శ్రీమనోజ్ (కోనసీమ).. 83 కిలోల విభాగంలో ఎం.కౌశిక్ (విజయనగరం), పి.భానుచంద్ర (కోనసీమ), కె.దుర్గాశివ (కోనసీమ) విజేతలుగా నిలిచారు.
సబ్ జూనియర్ విభాగంలో..
సబ్ జూనియర్ విభాగానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో పోటాపోటీగా తలపడిన పోటీల్లో 53 కిలోలకు సంబంధించి ఎస్.జీవన్‌కుమార్ (విశాఖ), బి.నాగహర్ష (కోనసీమ), కె.కార్తీక్ (పల్నాడు) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే 59 కిలోల విభాగంలో డీజీ వర్థన్ (కృష్ణ), బి.ఆర్యన్‌రావు (విశాఖ), బి.దీపిక (ప్రకాశం).. 66 కిలోల విభాగంలో జె.జితేంద్రదొర (కోనసీమ), ఎస్.సింయోను (కోనసీమ), ఎ.జగదీష్ (విజయనగరం).. 74 కిలోల విభాగంలో ఎంఎస్‌ఎస్‌డీ ప్రసాద్ (తూర్పు గోదావరి), కేబీఎస్ మణికంఠ ( కోనసీమ), జి.దినేష్‌ప్రసాద్ (కోనసీమ).. 83 కిలోల విభాగంలో కె.వరుణ్ (కాకినాడ), కె.నాని(కోనసీమ), ఎం.ధనుష్ (అనకాపల్లి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.


