జగ్జీవన్‌రామ్‌ మహనీయుడు | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ మహనీయుడు

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

జగ్జీవన్‌రామ్‌ మహనీయుడు

విజయనగరం క్రైమ్‌: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు. ఆదివారం స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడంతో పాటు హరిత విప్లవం విజయవంతం కావడంలో జగ్జీవన్‌రామ్‌ ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. కేంద్రంలో కమ్యునికేషన్‌, రవాణా, రైల్వే, రక్షణ, వ్యవసాయ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి, దేశ ప్రగతికి బాటలు వేశారన్నారు. దేశ చరిత్రలో 28 ఏళ్లు కేంద్రమంత్రిగా పనిచేసి, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆనాటి కాలంలో చదువుకు దూరమై దుర్భర జీవితం గడుపుతున్న దళితుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని తెలిపారు. అక్టోబర్‌ 19, 1935లో దళితుల ఓటుహక్కు కోసం హమ్మండ్‌ కమిషన్‌ ముందు వాదనలు వినిపించారని, రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడిగా కూడా సేవలందించారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్‌ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, సీఐలు ఈ నర్సింహమూర్తి, ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, సీహెచ్‌. సూరినాయుడు, ఆర్‌ఐ పి. శ్రీనివాసరావు, ఎస్సై శిరీష, సిబ్బంది లక్ష్మణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement