ఆండ్ర జలాశయం నుంచి అదనపు జలాలు | - | Sakshi
Sakshi News home page

ఆండ్ర జలాశయం నుంచి అదనపు జలాలు

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

ఆండ్ర జలాశయం నుంచి అదనపు జలాలు

విజయనగరం: నగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఆండ్ర జలాశయం నుంచి అదనపు జలాలు తెప్పిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలస్వామి ఆదివారం తెలిపారు. వేసవి నేపథ్యంలో నగరవాసులకు తాగునీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాయకులు, కలెక్టర్‌ ఆదేశాలతో ఇరిగేషన్‌ అధికారులు స్పందించి, ఆండ్ర నుంచి జలాలు విడుదల చేశారన్నారు. అక్కడి నుంచి నీరు నెల్లిమర్ల హెడ్‌ వాటర్‌ వర్క్స్‌, చంపావతి, కుదిపి రిజర్వాయర్లకు అక్కడి నుంచి పిట్టాడ, లక్ష్మీపురం, సాలిపేట గజపతినగరం, డోలపేట గంగచోలవలస, తమ్మిరాజుపేట, గరివిడి, మొయిద ప్రాంతాల మీదుగా మూలస్టేషన్‌కు అక్కడి నుంచి నెల్లిమర్ల పంప్‌హౌస్‌కు నీరు వస్తుందన్నారు. మరో వారం రోజుల్లో ఆండ్ర నుంచి నెల్లిమర్ల రిజర్వాయర్‌కు అదనపు జలాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement