విజయనగరం టౌన్: అన్నమాచార్య సంకీర్తనలపై అందజేస్తున్న వేసవి ఉచిత శిక్షణను ఐదేళ్ల వయసు నుంచి చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు ఎం.భీష్మారావు కోరారు. ఈమేరకు కళాపీఠం ఆవరణలో వేసవి ఉచిత సంగీత శిక్షణ కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 25 నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టామన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 వరకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాపీఠం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.


