విజయనగరం లీగల్: రాష్ట్ర శాసన సభ మాజీ ఉప సభావతి,సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభధ్రస్వామి చిన్న అన్నయ్య, న్యాయవాది కోలగట్లతమ్మన్నశెట్టి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలు కె.మన్మథరావు, ఎం.బాలాజీ , బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్‌కుమార్ శనివారం పరామర్శించారు. మృతికి కారణాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


