విజయనగరం అర్బన్: రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు చేశామని పాలకులు చెప్పుకున్నారు. అయితే ప్రజాప్రతినిధుల ప్రకటనల్లో వాస్తవం ఎంతవరకు ఉందన్న టాపిక్‌పై ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2026 – 27 బడ్జెట్ అవుట్ రీచ్ పేరుతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. అయితే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయం – ప్రత్నామ్నాయాల కొరత
మాటల్లోనే పారిశ్రామికాభివృద్ధి..?
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సమావేశంలో పేర్కొన్నప్పటికీ.. ఇప్పటివరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడంలో గణనీయమైన పురోగతి కనిపించలేదు. ‘ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త’ అనే లక్ష్యం ప్రకటించినా వాస్తవానికి స్వయం ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయనేది బహిరంగ సత్యం.
అంతా ప్రచారమేనా..?
బడ్జెట్ అవుట్ రీచ్ లక్ష్యాలు – గతం, ప్రస్తుత పరిస్థితులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ .. అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను సమర్థించుకునేలా ఉందన్న విమర్శలు వినిపించాయి.
ఆర్థిక పరిమితులున్నా.. నిధులు
మంజూరు చేశామని చెప్పుకున్న పాలకులు
నిధుల విడుదలలో ఆలస్యం :
అధికారులు
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిత,
మంత్రి కొండపల్లి సమక్షంలో ‘బడ్జెట్ అవుట్ రీచ్’


