వైద్య విద్య దూరం
ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్ధులకు వైద్య విద్య దూరం అవుతుంది. డబ్బున్న వాళ్లే వైద్య విద్యను అభ్యసించగలరు. వైద్య సేవలు కూడా డబ్బులు వెచ్చించి చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకాకుడదనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమంలో సంతకం చేశాను.
– చప్ప వంశీ, విద్యార్థి,
రేగుబిల్లి గ్రామం, గంట్యాడ మండలం
అన్యాయం
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయం. ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. సామాన్యులకు వైద్యవిద్య తీరని కలగానే మిగిలిపోతుంది.
– నాగులాపల్లి ఇందు, విద్యార్థిని, వియ్యంపేట
వైద్య విద్య దూరం


