అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితం. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే కష్టమే. ప్రైవేటు పరమైతే సామాన్యులకి వైద్యం అందని ద్రాక్షలా మారుతుంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ముందుచూపుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటుచేశారు. వాటిని రద్దుచేయాలనే ఆలోచనరావడం దుర్మార్గమైన చర్య.
– బెవర గణేష్, విద్యార్థి, రేగిడి మండలం
ప్రభుత్వ కళాశాలలతోనే లబ్ధి
ప్రభుత్వ మెడికల్ కళాశాలలతోనే పేద విద్యార్థులకు లబ్ధిచేకూరుతోంది. ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది పేదవిద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టే అవుతుంది. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాన్ని మార్చు కోవాలి. – బి.రాంబాబు, రేగిడి మండలం
దారుణం
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. అలా చేస్తే పేద ప్రజలకు ఉచిత వైద్యం ప్రభుత్వం తరఫున అందకుండా పోతుంది. డబ్బులు ఇచ్చి వైద్య సేవలు పొందలేనివారు ఇబ్బంది పడతారు. కాలేజీల ప్రైవేటీకరణతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోతుంది.
– సూరిబాబు, విద్యార్థి, గురుదత్త కాలేజీ
ప్రజలకు అన్యాయమే..
ఎన్నికలకు ముందు ప్రజలకు మేలు చేస్తామంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానాన్ని అమలు చేయడం సరికాదు. ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రైవేటుకు అప్పగిస్తే వారు వ్యాపార ధోరణిలో ఫీజులు వసూలు చేస్తారు. ప్రైవేటీకరణ ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలి. – కె.జగదీష్,
విద్యార్థి, విజయనగరం
మంచి విధానం కాదు
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వారికి నచ్చిన ఫీజులు వసూలు చేస్తారు. ఆధిపత్యం వారిదే అవుతుంది. మెడికల్ సీట్లు ధర రూ.కోట్లలో ఉంటుంది. పేదలకు విద్య, వైద్యం అందాలంటే రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలి. – దాసరి గుణశ్రీ, కూర్మవరం, ఎల్.కోట మండలం
అనాలోచిత నిర్ణయం
అనాలోచిత నిర్ణయం
అనాలోచిత నిర్ణయం
అనాలోచిత నిర్ణయం


