యూపీఎస్సీలో మెరిసిన చైతన్య
● పట్టువదలని విక్రమార్కుడు
● యూపీఎస్సీ మెరిట్ జాబితాలో 135 ర్యాంకు
● ప్రతిష్టాత్మకమైన ఐఈఎస్‌కు ఎంపిక
● ప్రస్తుతం కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో
సైంటిస్టుగా విధులు
చీపురుపల్లి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అని చెప్పడానికి చీపురుపల్లి పట్టణానికి చెందిన పొదిలాపు చైతన్య చక్కని ఉదాహరణ. తాను అను కున్నది సాధించేందుకు ఎంత కష్టమైనా ఎదుర్కొ నేందుకు, ఎన్ని అవాంతరాలైనా దాటేందుకు, ఎలాగైనా అనుకున్నది సాధించేందుకు సిద్ధమయ్యారు. పట్టువదలని విక్రమార్కుడులా యూపీఎస్సీ పరీక్ష ల కోసం పుస్తకాలతో కుస్తీపట్టారు. ఓ వైపు కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సైంటిస్టుగా ఉద్యో గం చేస్తూనే యూపీఎస్సీ పరీక్షలు రాశారు. యూపీ ఎస్సీ బుధవారం 202 మందితో విడుదల చేసిన మెరిట్ జాబితాలో చైతన్య 135వ స్థానంలో నిలిచా రు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్)కు ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు. చైతన్య తండ్రి పొదిలాపు వెంకటరావు గరివిడి మండలంలోని కాపుశంభాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయునిగా పని చేస్తుండగా, తల్లి అలివేణి గృహిణి. యూపీఎస్సీలో ఉత్తమ ప్రతిభతో ఐఈఎస్‌కు ఎంపికవ్వడం పట్ల తల్లిదండ్రులతో పాటు భార్య లావణ్య సంతోషిస్తున్నారు. ఇదిలా ఉండగా సంతోష్ తమ్ముడు సునీల్ డీఆర్‌డీఓలో సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. చైతన్య ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు గరివిడిలోని గోదావరిదేవీ షరాఫ్ ఇంగ్లిష్ మీడి యం స్కూల్‌లోను, 9, 10 తరగతులు కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదువుకుని సివిల్ ఇంజనీరింగ్ బిట్స్‌లో పూర్తిచేశారు.


