పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
రామభద్రపురం: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి రోజూ తాగుతుం డడంతో భార్య మందలించిందని మనస్తాపం చెంది పురగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం గజరాయినివలస గ్రామానికి చెందిన నల్ల ఈశ్వరరావు (32) మద్యానికి బాగా బానిసై రోజూ తాగుతాడుతున్నాడు.అలాగే గురువారం కూడా తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఇలా రోజూ తాగితే ఎలా?మన భవిష్యత్‌తో పాటు పిల్లల భవిష్యత్ ఏమవుతుంది? అని భార్య వెంకటలక్ష్మి ప్రశ్నిస్తూ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఈశ్వరరావు మండలంలోని ఆరికతోట గ్రామం సమీపంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


