కన్నీరు మిగిల్చిన మోంథా | - | Sakshi
Sakshi News home page

కన్నీరు మిగిల్చిన మోంథా

Oct 31 2025 7:23 AM | Updated on Oct 31 2025 7:23 AM

కన్నీ

కన్నీరు మిగిల్చిన మోంథా

అన్నదాతకు కోలుకోలేని దెబ్బ

మొలకెత్తిన వరి, మొక్కజొన్న

ఆవేదనలో రైతన్న

రామభద్రపురం:

రుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నకు వరుస తుఫాన్‌లు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అపార నష్టం కలిగిస్తున్నాయి. మోంథా తుఫాన్‌ కన్నీరు మిగిల్చింది. మొక్కజొన్న, వరి, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లింది. మొక్కజొన్న గింజలకు మొలకలు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అమ్ముదామంటే కొను గోలు కేంద్రాలు లేవు.. ఇప్పుడు మొలకలు వచ్చిన పంటను కొనుగోలుచేసేవారే కరువయ్యారు. తడిసిన పంటను రక్షించుకునేందుకు తిరిగి పెట్టుబడి తడిసిమోపెడవుతుండడంతో రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారు.

పంటంతా పాడైంది

నా పేరు లగుడు సత్యం. మాది జామి గ్రామం. నేను 30 సెంట్లలో తోటకూర, పాలకూర, ఉల్లి, చిక్కుడు సాగుచేశాను. మోంథా తుఫాన్‌ వల్ల నీట మునిగాయి. కూరగాయలు, ఆకుకూరలు దెబ్బతిన్నాయి.

నీట మునిగిన పంట

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మూడు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. కంటికి రెప్పలా సాకుకుంటూ వచ్చాను. రాకాసి తుఫాన్‌తో పంటంతా నేలకొరిగింది. పాలుపోసుకునే దశలో పంట పాడైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. లేదంటే అప్పుల్లో కూరుకుపోతాం.

– లింగాల శంకరరావు, రెల్లి గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా

వీడని వరద

రేగిడి: మోంథా తుఫాన్‌ వరద పంట పొలాలను వీడడంలేదు. చేతికందొచ్చిన పంట వరదపాలు కావడంతో రైతులు కన్నీరుకార్చుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పథకం అమలులో ఉండడంతో విపత్తుల సమయంలో రైతన్నకు నష్టపరిహారం అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు.

కన్నీరు మిగిల్చిన మోంథా 1
1/3

కన్నీరు మిగిల్చిన మోంథా

కన్నీరు మిగిల్చిన మోంథా 2
2/3

కన్నీరు మిగిల్చిన మోంథా

కన్నీరు మిగిల్చిన మోంథా 3
3/3

కన్నీరు మిగిల్చిన మోంథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement