 
															అడుగుకో గుంత.. రాకపోకలకు చింత
జిల్లాలోని పల్లెలు, పట్టణాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. పల్లెపండగ పేరుతో రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామని ప్రకటనలు చేసిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. కొన్ని ప్రాంతాల్లోని రోడ్లను మరమ్మతులు కూడా చేయని పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారాయి. అడుగుకోగుంతతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి తక్షణమే రోడ్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లపై రాకపోకలకు పడుతున్న ఇబ్బందులను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేస్తూ నిరసన తెలుపుతున్నారు. రోడ్లు ఎప్పుడు బాగుచేస్తారు ‘బాబూ’ అంటూ ప్రశ్నిస్తున్నారు. –విజయనగరం రూరల్/వేపాడ/వంగర/సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం 
ఎటువెళ్లినా గోతులే.. కొత్తపేట రోడ్డులో
ప్రయాణ కష్టాలు
ఎస్‌ఎస్‌ఆర్ పేటలో కోతకు గురైనరోడ్డు
వంగర: తలగాం వద్ద
రోడ్డుపై ఏర్పడిన
గోతుల్లో చేరిన వర్షపు నీరు
 
							అడుగుకో గుంత.. రాకపోకలకు చింత

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
