ప్రతి నష్టాన్ని నమోదు చేయాలి
● కలెక్టర్
ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: భారీ వర్షాలకు, వరదలకు జరిగిన ప్రతి చిన్న నష్టాన్ని కూడా నమోదు చేయాలని, నష్టం విలువను అంచనా వేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితిపై జిల్లా అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పంటలు, పశువులు, రోడ్లు, విద్యుత్, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, వసతిగృహాలకు కలిగిన నష్టం అంచనా నివేదికలను అందజేయాలన్నారు. జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో 4,949 మంది ఉన్నట్టు తెలిపారు.
ఉచిత శిక్షణ
విజయనగరం టౌన్: సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్, మైనారిటీస్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో మైనారిటీ విద్యార్థులకు ఎస్‌ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్పీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మైనారీటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ కె.కుమారస్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో శిక్షణ సాగుతుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సీఈడీఎం కార్యాలయం, భవానీపట్నం, విజయవాడ–520012 చిరునామాకు బయోడేటాను పంపించాలన్నారు. వివరాలకు స్థానిక మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయం, ఫోన్–0866–2970567ను సంప్రదించవచ్చన్నారు.


