 
															పరవళ్లు తొక్కుతున్న పెద్దగెడ్డ
పాచిపెంట: మోంథా తుఫాన్ కారణంగా పెద్దగెడ్డ జలాశయం పరవళ్లు తొక్కుతోంది. జలాశయానికి ఎగువ నుంచి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో, రెండు గేట్లు ఎత్తి సుమారు 8వేల క్యూసెక్కుల వరద నీటిని పెద్దగెడ్డ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. నీరు విడుదల చేసే సమయంలో పైనుంచి నీరు అలా పరవళ్లు తొక్కుతూ కిందికి పడడం.,నీరు కిందకు పడే సమయంలో వచ్చే శబ్దం, ప్రకతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా గురువారం అధికసంఖ్యలో ప్రకతి ప్రేమికులు జలాశయానికి వచ్చి పెద్దగెడ్డ అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు దిగారు.
ఆస్వాదిస్తున్న ప్రకృతి ప్రేమికులు
 
							పరవళ్లు తొక్కుతున్న పెద్దగెడ్డ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
