 
															ముచ్చర్లవలసలో పారిశుద్ధ్యలోపం
రామభద్రపురం:
మండలంలోని ముచ్చర్లవలస గ్రామస్తులు అతిసారతో మంచంపట్టారు. 15 మంది వరకు వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అతిసార వ్యాప్తికి గ్రామంలో పారిశుద్ధ్యలోపం, కలుషిత తాగునీరే కారణమని అధికారులు భావిస్తున్నారు. గ్రామంలోని ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలు, ఇళ్ల మధ్య మురుగునీరు నిల్వ ఉండడంతో దోమ లు వ్యాప్తిచెందుతున్నాయి. జనంపై దాడిచేస్తున్నాయి. వ్యాధులు వ్యాప్తిచెందినప్పుడు హడావిడి చేస్తున్నారే తప్ప సాధారణ రోజుల్లో పారిశుద్ధ్యంపై పట్టించుకునేవారే లేరని గ్రామస్తులు ఆరోపిస్తు న్నారు. గ్రామాన్ని బుధవారం డీఎంహెచ్‌ఓ, డీపీఓ, ఆర్డీఓ, మండల స్థాయి అధికారులు సందర్శించగా, గురువారం ఽడీఎంహెచ్‌ఓ, డీఎల్‌డీఓ తదితర అధికారులు పర్యటించి అతిసార వ్యాప్తిపై ఆరా తీశారు. కోటశిర్లాంలోని ఏడొంపుల గెడ్డ నుంచి గ్రామానికి తాగునీరు సరఫరా అవుతోంది. చెత్త సంపద కేంద్రం వద్ద ఉన్న మురుగునీటి కాలువలోని తాగునీటి పైపు లీకేజీలతో నీరు కలుషితమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
 
							ముచ్చర్లవలసలో పారిశుద్ధ్యలోపం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
