 
															కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యర్థాలు వేస్తే సహించేది లేదు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల వ్యర్‌ాధ్యలు కలెక్టరెట్ ప్రాంగణంలో వేస్తే సహించేది లేదని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి హెచ్చరించారు. ‘కంపుకొడుతున్న కలెక్టరేట్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ఆయన స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని గురువారం ఆదేశాలిచ్చారు. ప్రతి నెల మూడవ శనివారం తప్పనిసరిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
మడ్డువలసకు వరద ఉద్ధృతి
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సువర్ణముఖి, వేగాతి నదుల నుంచి గురువారం 24,600 క్యూసెక్కులనీరు ప్రాజెక్టులో చేరుతుండగా, ఎనిమిది గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 63.71 మీటర్ల మేర నీటిమట్టం నమోదైందని ఏఈ నితిన్ తెలిపారు.
 
							కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యర్థాలు వేస్తే సహించేది లేదు
 
							కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యర్థాలు వేస్తే సహించేది లేదు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
