ఈ చిత్రాలు చూశారా... లక్కవరపుకోట మండలం
గంగుబూడి గ్రామ సచివాలయం పరిధిలో లక్షలాది రూపాయల ఖర్చుతో గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్‌క్లినిక్, రైతుభరోసా కేంద్రాలివి. భవనాలు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం మారడంతో ఇవి అందుబాటులోకి రాలేదు. దీనినే అనువు గా చేసుకుని ఓ రెండు కుటుంబాలు ఏకంగా భవనాల్లో కాపురం పెట్టేశాయి. ప్రభుత్వ భవనాలను సొంతిల్లుగా వాడుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు ఈ భవనాలే నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. స్థానికులకు వైద్యసేవలు, రైతులకు సాగు సేవలందించేందుకు నిర్మించిన భవనాలను వినియోగంలోకి తేవడంలో కూటమి ప్రభుత్వం అలక్ష్యం చేస్తోందని, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి తూట్లు పొడుస్తోందంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి భవనాలను వినియోగంలోకి తేవాలని, ఉద్యోగుల విధులకు కేటాయించాలని కోరుతున్నారు. – లక్కవరపుకోట
రైతుభరోసా కేంద్రంలో నివసిస్తున్న
ఓ కుటుంబం
● నివాసాలుగా ప్రభుత్వ భవనాలు
● నివాసాలుగా ప్రభుత్వ భవనాలు