
రోగులను ఇబ్బంది పెడితే సహించేది లేదు..
● కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్యసేవ) కింద వైద్యం పొందుతున్న రోగులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తే సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తప్పవని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. రోగి ప్రవేశ సమయంలో చెల్లించిన మొత్తా న్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజున తిరిగి చెల్లించాలని సూచించారు. అదనంగా వసూలు చేసినట్టు రుజువైతే ఆసుపత్రుల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆసుపత్రుల యాజమాన్యాలతో ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై గురువారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు. సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే ఆసుపత్రుల వారే బాధ్యత తీసుకోవాలని, రోగులపై నెట్టకూడదన్నా రు. ఏయే ఆసుపత్రులపై ఫిర్యాదులు అందింది పరిశీలించారు. అత్యధికంగా తిరుమల మెడికవర్‌పై 28, మిమ్స్ ఆసుపత్రిపై 12, సాయి సూపర్ స్పెషా లిటీ ఆసుపత్రిపై 9 ఫిర్యాదులు అందినందున ఈ ఆసుపత్రులపై అందిన ఫిర్యాదులను కేసుల వారీగా విచారణ చేసి నివేదిక అందజేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సాయిరామ్, మేనేజర్ దూబ రాంబాబు పాల్గొన్నారు.
సెప్టెంబర్ నాటికి సంక్షేమ హాస్టళ్లకు మరుగుదొడ్లు
విజయనగరం అర్బన్: జిల్లాలోని అన్ని రకాల సంక్షే మ వసతిగృహాలకు సెప్టెంబరు నాటికి మరుగుదొ డ్ల సౌకర్యాన్ని కల్పించాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో తమ చాంబర్‌లో గురువారం సమావేశమై, హాస్టళ్లలోని మరుగుదొడ్ల సౌకర్యంపై సమీక్షించారు. అక్కడి వసతులను, ప్రతిపాదనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా హాస్టళ్లకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 15 సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. వీటిలో 11 హాస్టళ్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయని, వీటిని ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా నిర్మిస్తామని, పట్టణ ప్రాంతంలో ఉన్న మిగిలిన నాలుగు హాస్టళ్లను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించాలని ఆదేశించారు. బీసీ సంక్షే మ శాఖ పరిధిలో 39 హాస్టళ్లలో మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. వారం రోజుల్లో వీటి నిర్మాణాన్ని ప్రారంభించి, సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారిణి అన్నపూర్ణ, బీసీ సంక్షేమ శాఖాధికారిణి జ్యోతిశ్రీ, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.