
గోడను బైక్ ఢీకొని బాలుడు మృతి
విజయగరం క్రైమ్: విజయనగరం మండలం ధర్మపురి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నింటి ప్రణీత్(15) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేటకు చెందిన ప్రణీత్ తన ఇద్దరి స్నేహితులతో బైక్‌పై ఈ నెల 9న సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భీమిలి రోడ్డు మీదుగా ధర్మపురి రోడ్డులోకి వస్తున్న బైక్ రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటి గోడను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో విజయనగరంలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ శనివారం మృతి చెందినటుట రూరల్ ఎస్‌ఐ అశోక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.