
జంతువుల నుంచి మనుషులకు 70 శాతం వ్యాధుల వ్యాప్తి
● జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి
డాక్టర్ వై.వి.రమణ
విజయనగరం ఫోర్ట్: సుమారు 70 శాతంకు పైగా వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమిస్తాయని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వై.వి.రమణ అన్నారు. స్థానిక బహుళార్ధ పశు వైద్యశాల వద్ద ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. పెంపుడు జంతువులు పట్ల జంతు ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలన్నారు. 584 పెంపుడు కుక్కలు, పిల్లులకు రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గంటి మహాలక్ష్మి, సహాయ సంచాలకులు డాక్టర్ సన్యాసినాయుడు, వైద్యులు కె.వి.రమణ, ధర్మారా వు, పశు వైద్యులు డాక్టర్ మోహన్, డాక్టర్ హిమజ డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.