
● మూణ్నాళ్ల ముచ్చట..!
చిత్రంలోని సీసీ రోడ్డును చూశారా.. ఇది నెల్లిమర్ల మండలం పెద్ద బూరాడపేట గ్రామంలో నెలరోజుల కిందట నిర్మించారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో సుమారు 500 మీటర్ల మేర సీసీ రోడ్డు వేయడంతో గ్రామస్తులు సంతోషించారు. అయితే.. వారి సంతోషం మూణ్నాళ్లముచ్చటే అయ్యింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలివ్వడంతో ఇదిగో ఇలా పెచ్చులూడి బుగ్గిరేగుతోంది. ఇదేం రోడ్డు నిర్మాణమంటూ స్థానికులు ముక్కునవేలేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపిస్తున్నారు.
– నెల్లిమర్ల రూరల్