
చిత్తశుద్ధితో అర్జీలు పరిష్కరించండి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
● పీజీఆర్‌ఎస్‌కు అందిన 92 వినతులు
పార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో 92 మంది అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించగా, జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ,జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి భాగస్వామ్యమై వినతులను అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కావున అర్జీలను చిత్త శుద్ధితో త్వరితగతిన పరిష్కారం చేఆయలని అధికారులను ఆదేశించారు.
అర్జీలు కొన్ని ఇలా..
● పాలకొండ నగర పంచాయతీలో పొరుగు సేవల కింద శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడగా హైకోర్టులో కేసు ఉంది. దానిపై తుది తీర్పు రాకముండే ఆ పోస్టును భర్తీ చేస్తున్నారని, కావున తీర్పు వచ్చేంతవరకు దాన్ని నిలుపుదల చేయాలని పాలకొండకు చెందిన కొనపల వీరభద్రపురం వినతి పత్రాన్ని అందజేశాడు.
● గుమ్మలక్ష్మీపురం మండలం పాముల గీసాడ జంక్షన్ నుంచి చిన్న రావికోన గ్రామం వరకు తారు రోడ్డు వేయాలని చిన్న రావికోన గ్రామానికి చెందిన తోయక జమ్మన్న విజ్ఞప్తి చేశాడు.
● బలిజిపేట మండలం పెద్దింపేట నుంచి ముదిలి జనార్దన్ అర్జీని ఇస్తూ తమ గ్రామంలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి సుమారు 200 మంది వేతనదారులకు జనవరి మూడవ వారం నుంచి నేటివరకు వేతనాలు చెల్లించలేదని, వాటిని మంజూరు చేయాలని కోరారు.
● పార్వతీపురం మండలం డి.ములగ నుంచి చౌదరి రాణి వినతి పత్రాన్ని అందజేస్తూ, తాము పెయింటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తమకు ఆధార్, రేషన్ కార్డులు లేనందున వాటిని మంజూరుచేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.
చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలి
పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికాారులు చొరవ చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే చట్టపరిధిలో నాణ్యమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి జిల్లాలో ఉన్న పలు పోలీసు స్టేషన్‌ల పరిధిలలో నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి చూసి ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుల్లో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేదింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై ఎస్పీ 12 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ గ్రీవెన్స్‌సెల్‌కు 22 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 22 వినతులు వచ్చాయి. విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్ వేయించాలని భామిని మండలం సన్నాయిగూడ రైతులు కోరారు. వరదగోడ మంజూరు చేయాలని టిటుకుపాయిగూడకు చెందిన ఆరిక శ్యామల రావు, మల్లి గ్రామానికి చెందిన బూగన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు, ఈఈ రమాదేవి, పీహెచ్‌వో ఎస్‌వీ గణేష్, ఏటీడబ్ల్యూవో మంగవేణి, ఇన్‌చార్జ్ డిప్యూటీఈవో చంద్రరావు, ఏఎంవో కోటిబాబు, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ జాకాబ్ దయానంద్, ఏపీడీ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్తశుద్ధితో అర్జీలు పరిష్కరించండి

చిత్తశుద్ధితో అర్జీలు పరిష్కరించండి