
జీతం విడుదల చేయండి
విజయనగరం ఫోర్ట్: సీహెచ్‌ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల)లకు వెంటనే ఏప్రిల్ నెల జీతం విడుదల చేయాలని జీహెచ్‌ఓలు మౌనిక, కనకదుర్గ కోరారు. తమ సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సీహెచ్‌ఓల సర్వీసును క్రమబద్ధీకరించాలని, ప్రతీనెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించా లని డిమాండ్ చేశారు. 30 శాతం జీతం పెంచా లని కోరారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓలు శ్రీను, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
చలో కలెక్టరేట్ రేపు
● డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్
విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ అభ్యర్ధులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ ఈ నెల 14న తలపెట్టిన చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (డీవైఎఫ్‌ఐ) సభ్యులు పిలుపునిచ్చారు. కోట కూడలిలో సోమవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్.హరీష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులు పోరాడి డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నారన్నారు. ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారికి, రెగ్యులర్ డిగ్రీ పాస్ అయిన వారికి సమాన అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాకు ఒకే పేపర్‌తో పరీక్ష నిర్వహించాలన్నారు. 14న కోట కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే ర్యాలీలో డీఎస్సీ అఽభ్యర్థులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాను, ఈశ్వరరావు, శ్రీను, కిషోర్, రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై
కలెక్టర్‌కు ఫిర్యాదు
రామభద్రపురం: మండలంలోని మిర్తివలస పంచాయతీ మధుర గ్రామం కాకర్లవలసలో ఈ నెల 10న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి మిర్తివలస సర్పంచ్‌ను ఆహ్వానించకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు సోమవారం ఫిర్యాదు చేశామని జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మజ్జి రాంబాబు తెలిపారు. శిలాఫలకంపై మిర్తివలస పంచాయతీ సర్పంచ్ పేరు రాయకుండా కొట్టక్కి పంచాయతీ సర్పంచ్ పేరు రాయడంపై అభ్యంతరం తెలిపారు. ఇది తనతో పాటు గ్రామ ప్రజలను అగౌరవ పరిచినట్టేనన్నారు. కార్యక్రమంలో పలువురు పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పాలకుల వైఖరిలో మార్పుతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి
బొబ్బిలి: పాలకుల వైఖరిలో పూర్తిస్థాయి మార్పు వస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్య మని ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు రౌతు రామమూర్తినాయుడు అన్నారు. బొబ్బిలిలోని ఎన్‌జీఓ హోంలో ఉత్తరాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో రామమూర్తినాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న అపారమైన ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి చెందుతాం తప్ప రాజకీయల వల్ల కాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపన వంటి చర్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు మెరిగాని గోపాలం మాట్లాడుతూ స్థానిక గ్రోత్ సెంటర్‌లో స్థానికులకు ఉద్యోగాలు లేవన్నారు. కార్యక్రమంలో వెంకటనాయుడు, అప్పలరాజు, డి. సత్యంనాయుడు, రెడ్డి దామోదరరావు, చింతల శ్రీనివాసరావు, బొత్స గణేష్ పాల్గొన్నారు.

జీతం విడుదల చేయండి