
పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు..
ప్రజాస్వామ్యానికి ప్రమాదం
ప్రభుత్వాల్లో ఎవరు అధికారంలో ఉన్నా.. పత్రికా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛలకు భంగం కలగకుండా చూడాల్సిందే.. వ్యవస్థ గాడి తప్పుతున్నప్పుడు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా.. మాట్లాడే పరిస్థితి రాజకీయాల్లో పెరిగిపోయింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి పెను ప్రమాదం. పోలీసులు, అధికారులు, నాయకులు తమ పరిధి దాటకుండా ఉండాలి.
– భీశెట్టి బాబ్జీ , పౌరవేదిక జిల్లా అధ్యక్షుడు
దాడిని ఖండిస్తున్నాం..
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడిని ఖండిస్తున్నాం. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని కాళోజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విస్మరించి మౌనంగా ఉంటే ప్రభుత్వ తప్పిదాలను అంగీకరించడమే అవుతుంది. వాస్తవాలు ప్రజలకు చేరవేయడమే నేరంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పత్రికా స్వేచ్ఛను హరించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని తెలుసుకోలేకపోతోంది.
– బుగత అశోక్, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి.
విజయనగరం:
‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటి మీద దాడి చేయడం.. ప్రజాస్వామ్యంపైన, పత్రికా స్వేచ్ఛపైన దాడి చేయడమేనని... ఇది మంచి పరిణామం కాదని పలువురు ఖండించారు. ఈ దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ లోపాలను, తప్పులను ఎత్తిచూపడం మీడియా విధి అని.. అభ్యంతరాలుంటే ఖండించాలే తప్ప ఇటువంటి సంస్కృతి మంచిది కాదని ధ్వజమెత్తారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండించిన వారి మాటల్లోనే....
పిరికి పంద చర్య
రెడ్ బుక్ పాలనలో పత్రికా స్వేచ్ఛ ఖూనీ అవుతుంది. సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడే పత్రికలు, మీడియాపైన దాడులు చేయడం పిరికి పంద చర్య. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. అధికారంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా పత్రికా విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.
– రెడ్డి శంకరరావు,
పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి
ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాల్సిందే..
‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క సాక్షినే కాదు.. మొత్తం పత్రికా స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడిని ప్రజాస్వామ్య వాదులంతా, పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారంతా ఖండించాలి.
– ఎం.కృష్ణమూర్తి, సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు..

పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు..

పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు..

పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు..