
రాజాం సిటీ: స్థానిక బొబ్బిలి జంక్షన్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒమ్మి గ్రామానికి చెందిన పడాల సూర్యవంశీ గాయాలపాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఒమ్మి గ్రామం నుంచి శ్రీకాకుళం ఆటోలో మామిడిపళ్లు తీసుకువెళ్తున్నారు. బొబ్బిలి జంక్షన్‌కు వచ్చేసరికి డివైడర్‌ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సూర్యవంశీ రోడ్డుపై పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108కు సమాచారం అందించగా హుటాహుటిన వచ్చి క్షతగాత్రుడికి ఈఎంటీ ఆలుగుబిల్లి శ్రీనివాసరావు, పైలెట్ శంకరరావులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
పీహెచ్‌సీ సీనియర్ అసిస్టెంట్‌కు గాయాలు
మండల పరిధి శ్రీకాకుళం రోడ్డులోని రెండో మైలు రాయి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో పొగిరి గ్రామానికి చెందిన పొగిరి గంగారాం తీవ్రగాయాలపాలయ్యాడు. గంగారాం రాజాం నుంచి స్వగ్రామం పొగిరి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఒక్కసారిగా బైక్ అదుపు తప్పగా రోడ్డుపై పడిపోయాడు. పొగిరి గ్రామానికి చెందిన గంగారాం బొద్దాం పీహెచ్‌సీ సీనియర్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ ఎ.శ్రీనివాసరావు, పైలెట్ శంకరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్సకోసం శ్రీకాకుళం తరలించారు.