
విజయనగరం
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025
● ప్రజాసమస్యలపై గొంతెత్తనీయకుండా దాడులు ● పత్రికా స్వేచ్ఛను హరించే యత్నంపై నిరసన ● సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడికి ఖండన ● నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన విజయనగరం జిల్లా జర్నలిస్టులు ● పోలీసుల దాడులు అరికట్టాలంటూ డీఆర్వోకు వినతిపత్రం అందజేత
హైరిస్క్ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయాలి
మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్‌ఓ భాస్కరరావు ఆదేశించారు.
పట్టుబడిన ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు
వేపాడ, ఎల్.కోట, కొత్తవలస, జామి, విజయనగ రం రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. –10లో
జర్నలిజంపై దాడి సిగ్గుసిగ్గు
బొబ్బిలి: జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేయడం ప్రజాస్వామ్యం గొంతునొక్కడమేనని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు అన్నారు. సెర్చ్‌వారెంట్ లేకుండా విజయవాడలో సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ రెడ్డి ఇంటిలోకి చొర బడడం, దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. దీనిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పత్రికపై దాడి సిగ్గుసిగ్గు అంటూ నినదించారు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఎడిటర్ స్థాయి వ్యక్తిపై దాడులకు పూను కుంటున్నారంటే సాధారణ విలేకరుల పరిస్థితి ఏమిటన్నారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపకుండా జర్నలిస్టులను భయపెట్టడమే దీని వెనుక ఉన్న అసలు కారణమన్నారు. దాడిని ఖండిస్తూ తహసీల్దార్ ఎం.శ్రీనుకు వినతిపత్రా న్ని అందజేశారు. పాత్రికేయులు, పత్రికా రంగానికి రక్షణ కల్పించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి రేగులవలస వ్యాస్‌బాబు, జర్నలిస్టు సంఘాల సభ్యులు చుక్క జగన్మోహనరావు, రుంకాన రమేష్, వెలమల తిరుమల, సత్యనారాయణ, వీఎన్ శర్మ, బొద్దాన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం:
ప్రజాస్వామ్య పాలనలో ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవ బడే పత్రికల గొంతు నొక్కడంపై జర్నలిస్టు సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నంలో పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై ప్రభుత్వం ఆక్రోశం వెళ్లగక్కడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఎటువంటి అనుమతులు లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసులు దాడిచేయడం, సోదా లు నిర్వహించడాన్ని తప్పుబట్టాయి. ప్రజాస్వామ్య పాలనలో ఇదొక మాయనిమచ్చని పేర్కొన్నాయి. ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా విజయన గరం కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీవిగ్రహం వద్ద సాక్షి మీడియా, ఏపియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి ‘అక్షరంపై దాడి సిగ్గు సిగ్గు... ఉయ్ వాంట్ జస్టిస్... పత్రికా స్వేచ్ఛపై సంకెళ్లు ఖండించాలి... ఖండించాలి... అంటూ ప్లకార్డులు ప్రద ర్శించి నినదించారు. అనంతరం డీఆర్వో శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందేశారు. ఈ సందర్భంగా జర్న లిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తగదన్నారు. ప్రజాసమస్యలను, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టే జర్నలిస్టులపైన, పత్రికలపైన పోలీసులను దాడులకు పురిగొల్పడం సరికాదని హెచ్చరించారు. బెదిరించే క్రమంలో అక్రమకేసులు బనాయిస్తే జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మండల కేంద్రం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిలో పోలీసులు సోదాలు చేయడాన్ని ముక్తకంఠంతో ఖండించాయి. రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం ఉన్న పత్రికల పట్ల చట్టపరమైన, విధానపరమైన చర్యలకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాక్షస నీతితో వ్యవహరించడాన్ని తూర్పారబట్టారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా జర్నలిస్టులకు, పత్రికలకు ప్రభుత్వం అండగా నిలవాలని, పోలీసుల దాడులు అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో సాక్షి టీవీ బ్యూరో అల్లు యుగంధర్, పాత్రికేయులు నరేష్, గౌరీశంకర్, ఎర్నినాయుడు, సత్యనారాయణ, తిరుపతిరావు, అప్పలనాయుడుతో పాటు సంతోష్, కన్నన్, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఎటువంటి ముందస్తు నోటీసులు జారీ చేయ కుండా తనిఖీలు నిర్వహించడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 9 సార్లు జర్నలిస్టులపై దాడులు నిర్వహించడం దారుణం. పత్రికా రంగంలో తప్పొప్పులు జరిగితే అనేక రకాలైన మార్గాల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. జర్నలిస్టు సంఘాలతో చర్చలు జరపడం ద్వారా సమస్యను సద్దుమణిగించుకోవచ్చు. అలాకాకుండా పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం సరికాదు. ఎడిటర్ స్థాయి వ్యక్తి ఇంటిపై అనధికారికంగా దాడిచేయడం, ఇంటిలో సోదాలు నిర్వహించడాన్ని తప్పుబడుతున్నాం. ఇటువంటి చర్యలు ఆపకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అధికారులపై ప్రైవేటు కేసు నమోదు చేసేందుకు వెనుకాడం.
– పి.వి.శివప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే
రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం