
నేటి నుంచి రాష్ట్రస్థాయి ఆహ్వానపు నాటిక పోటీలు
చీపురుపల్లిరూరల్ (గరివిడి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన పు నాటిక పోటీల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గరివిడి శ్రీరాం హైస్కూల్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు నాటిక పోటీల ప్రదర్శన సాగనుంది. ఈ మేరకు గరివిడి కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హైద రాబాద్‌కు చెందిన విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు ’స్వేచ్ఛ’, హైదరాబాద్‌కు చెంది న మిత్ర క్రియేషన్స్ వారు ‘ఇది రహదారి కా దు’ అనే నాటికలు ప్రదర్శిస్తారు. మొదటిరోజు జరగనున్న కార్యక్రమంలో సినీనటుడు నారాయణమూర్తి, నరసింహరాజుపాల్గొననున్నారు.
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి
గంట్యాడ: పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరా ణి వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని పెదమజ్జిపాలేం పీహెచ్‌సీ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. ఈడీడీ చార్టన్‌ను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో నెలకు పది వరకు ప్రస వాలు నిర్వహించాలని సూచించారు. పీహెచ్‌సీ లో సుఖ ప్రసవాలు చేస్తామన్న నమ్మకాన్ని గర్భిణులకు కలిగించాలని అన్నారు. అప్పుడే గర్భిణులు ఆస్పత్రిలో ప్రసవాలు చేసుకునేందుకు ముందుకు వస్తారన్నారు. అదే విధంగా ఓపీ సంఖ్యను పెంచాలన్నారు. మాతృ మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. ప్రసవ తేదీకి మూడు నాలుగు రోజుల ముందే గర్భిణులు ఆస్పత్రుల్లో చేర్పించాల న్నారు. హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. తరువాత తామరపల్లి లో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ పల్లవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ అభ్యర్థుల నిరసన
విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని, జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ ఆధ్వర్యంలో విజయనగరం కోట కూడలి వద్ద గురువారం ఆందోళన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి నిరుద్యోగులు ఎదురుచూశారన్నారు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం 90 రోజులు సమయం లేకపోవడం ఆందోళనకు గురవుతున్నామన్నారు. వయోపరిమితి 44 సంవత్సరా లే కావడంతో చాలామంది వయో భారంతో అర్హత కోల్పోతున్నట్టు వెల్లడించారు. ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాము, భాను, ఈశ్వరరావు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

నేటి నుంచి రాష్ట్రస్థాయి ఆహ్వానపు నాటిక పోటీలు