
పాత తలుపునకు కొత్త రాడ్డు
సంతకవిటి మండలం రంగారాయపురం వద్ద నారాయణపురం ఆనకట్టలో జరుగుతున్న స్కవర్‌వెండ్స్ మార్పిడి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. నదిలోకి నీటిని మళ్లించేందుకు నాలుగు స్కవర్ వెండ్స్‌ను తొలగించి కొత్తవి అమర్చాలి. ఒక స్కవర్ స్లూయీస్ తలుపును తొలగించకుండా పాతదానికే కొత్త స్క్రూ రాడ్డును బిగించారు. దీనిపై రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. డబ్బులు మిగుల్చుకునే పనులు చేయొద్దని, పాత తలుపును
తొలగించి కొత్త తలుపును అమర్చాలని కోరుతున్నారు.
– సంతకవిటి