ఆరోగ్యంపై కాలుష్యం కాటు..! | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై కాలుష్యం కాటు..!

May 8 2025 11:15 AM | Updated on May 8 2025 11:15 AM

ఆరోగ్

ఆరోగ్యంపై కాలుష్యం కాటు..!

సమస్యలివే..

● మెదడు కుచించుకుపోయి మతిమరుపు వస్తుంది

● రక్తంలో కలిసిన రసాయనాలు మెదడులోని కీలక భాగాలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా నరాలసమస్యతో కాళ్లు, చేతులు పనిచేయని పరిస్థితి ఎదురవుతుంది. కొందరికి పక్షవాతం కూడా రావచ్చు.

● వాసన గ్రహించలేకపోతారు.

● పార్కిన్‌సన్‌ (వణుకుడు రోగం) వ్యాధి రావచ్చు

● డిప్రెషన్‌కు గురవుతుంటారు

● హార్మోన్స్‌ సక్రమంగా రిలీజ్‌ కావు

● పిల్లల్లో ఎదుగుదల సమస్య తలెత్తవచ్చు

● ఫిట్స్‌, మైగ్రేన్‌, తలనొప్పి రావచ్చు

జన్యుపరమైన లోపాలే కాకుండా సమతుల్య ఆహార విధానలేమి, శ్రమలేని జీవన విధానాల వంటి వాటితో పాటు పర్యావరణ సంబంధిత వాహన కాలుష్యం వంటివి కూడా మధుమేహవ్యాధి సంక్రమించడానికి ముఖ్యభూమిక పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

మెదడుపై తీవ్ర ప్రభావం

డిప్రెషన్‌, మతిమరుపు సమస్యలు

పార్కిన్‌సన్స్‌ వచ్చే ఆస్కారం

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

రాజాం సిటీ: వాహనాల వినియోగం పెరగడంతో పాటు కాలం చెల్లినవి రోడ్లపై పరుగులు తీస్తుండడంతో అధికంగా కాలుష్యం వెలువడుతోంది. నిత్యం ద్విచక్రవాహనాలపై తిరిగే వారికి వాహన కాలుష్యంతో పాటు మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా రసాయనాలు రక్తంలో కలిసి మెదడుపై ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. ఇవి దీర్ఘకాలంలో అనేక దుష్పరిణామాలకు దారి తీస్తాయని వెల్లడిస్తున్నారు. కాలుష్యం కారణంగా సమస్యలకు గురవుతున్న వారిని తరచూ చూస్తున్నామని వైద్యులు తెలియజేస్తున్నారు.

అదుపులో ఉండని

దీర్ఘకాలిక వ్యాధులు..

కాలుష్య ప్రభావానికి గురయ్యే వ్యక్తుల్లో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండవు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులు అదుపులో లేకపోవడంతో కీలక అవయవాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు, కిడ్నీల ఫెయిల్యూర్‌, రక్త ప్రసరణ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు.

ఏం చేయాలంటే..

ప్రజలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వీలైనంత వరకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తే కాలుష్యం బారిన పడకుండా తగ్గించుకోవచ్చు.

ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌తోపాటు సర్జికల్‌ మాస్క్‌లాంటిది పెట్టుకుంటే మంచిది

కాలం చెల్లిన వాహనాల వినియోగాన్ని నివారించాలి

ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకంపై దృష్టి సారించాలి. అలాగే రోడ్ల వెంట విరివిగా మొక్కలు నాటితే కాలుష్య ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయి.

మధుమేహం వచ్చే ప్రమాదం..

నైట్రోజన్‌ డయాకై ్సడ్‌ అధికంగా ఉన్న గాలిని పీల్చేవారు మధుమేహం బారిన పడతారు. గాలిలో 2.5 మైక్రో మీటర్లకన్నా తక్కువ పరిమాణం ఉన్న కాలుష్య పదార్థాలు ఊపిరితిత్తుల ద్వారా శరీరంలో చేరి అక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను పెంచడమే కాకుండా ఇన్‌ఫ్లమేషన్‌ ప్రక్రియను ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్‌ నిరోధకతకు కారణమై మధుమేహానికి దారితీస్తాయి. వాహనాల శబ్దకాలుష్యంతో నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడితో హార్మోన్లు, మెటబాలిజం అసమతుల్యతతో ఇన్సులిన్‌ నిరోధకత ఏర్పడుతుంది. ఫలితంగా మధుమేహం రావచ్చు. డాక్టర్‌ ఎం.కోటేశ్వరరావు,

ప్రాంతీయ ఆస్పత్రి, రాజాం

మెదడుపై ప్రభావం..

కాలుష్యం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రెయిన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. మెదడులో కీలక భాగాలపై కాలుష్యంలోని రసాయనాలు ప్రభావంచూపి న్యూరోలాజికల్‌ సమస్యలు తలెత్తవచ్చు. కాలు చేయి పట్టు తప్పడం, బ్రెయిన్‌స్ట్రోక్‌, వణుకుడు రోగం వంటివి రావచ్చు. కాలుష్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పట్టణంలో తిరిగేవారు మాస్క్‌ధరించడం మంచిది.

డాక్టర్‌ కరణం హరిబాబు, సూపరింటెండెంట్‌,

ప్రాంతీయ ఆస్పత్రి, రాజాం

ఆరోగ్యంపై కాలుష్యం కాటు..!1
1/2

ఆరోగ్యంపై కాలుష్యం కాటు..!

ఆరోగ్యంపై కాలుష్యం కాటు..!2
2/2

ఆరోగ్యంపై కాలుష్యం కాటు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement