వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

May 7 2025 11:20 AM | Updated on May 7 2025 11:30 AM

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని మేదరవీధి జంక్షన్‌ సమీపంలో ఉన్న లక్కీ రెడీమేడ్‌ వస్త్ర దుకాణంలో మంగళవారం వేకువజామున విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తు వరకు ఉన్న ఈ వస్త్ర దుకాణంలో కింద అంతస్తు పూర్తిగా దగ్ధమవగా మొదటి అంతస్తు పాక్షికంగా ప్రమాదానికి గురైంది. ప్రమాద సమాచారం మేరకు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనుబాబు మాట్లాడుతూ ముందుగా ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అదుపుచేశామన్నారు. అగ్నిప్రమాదంలో జరిగిన ఆస్తినష్టాన్ని వస్త్ర దుకాణ యజమాని నుంచి బిల్లులను పరిశీలించి అంచనా వేయనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement