పార్వతీపురం రూరల్: మండలంలోని పెదమరికి గ్రామం నుంచి కారాడవలస గ్రామానికి దినసరి కూలీలతో వెళ్తున్న ఆటో కృష్ణపల్లి గ్రామ శివారు ప్రాంతంలో మలుపు వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఓ యువకుడి కాలికి తీవ్రగాయమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి 108 వాహనం చేరుకుని క్షతగాత్రులను పార్వతీపురం కేంద్రాస్పత్రికి తరలించింది. గాయా ల పాలైన వారిని పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గంట్యాడ: గజపతినగరం మండలం ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన వసాత హరీష్ (30) గంట్యాడ మండలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం మండలంలోని వైఎస్సార్‌నగర్‌లో ఉంటూ అరకులో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌లో హరీష్ పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి అధిక మొత్తంలో అప్పలు చేవాడు.
అవితీర్చలేనేమోనన్న బెంగతో గంట్యాడ మండలం కొండతామరపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న తోటలోకి వెళ్లి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గడ్డిమందు తాగేశాడు. పరిస్థితి విషమంగా మారడంతో భార్యకు ఫోన్ చేయగా కుటుంబసభ్యులు చేరుకుని విజయనగరంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 8:20 గంటలకు మృతిచెందాడు. హరీష్‌కు ఏడాది క్రితం వివాహమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు.

ఆటోబోల్తా: పలువురికి గాయాలు