
20న దేశ వ్యాప్త సమ్మె
● కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్‌ల ఐక్యవేదిక
విజయనగరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. సమ్మె సన్నద్ధానికి సంబంధించి ఐఎఫ్‌టీయూ నాయకుడు కె.అప్పలసూరి, స్వతంత్ర ఫెడరేషన్లు ఐక్య వేదిక ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో సదస్సులు, కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు జరపాలని, మే 10న విజయనగరంలో సదస్సు నిర్వహించాలని, మే 16, 17, 18 తేదీల్లో జిల్లా, మండల కేంద్రాల్లో ప్రదర్మనలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల సంపదను పెట్టుబడిదారులకు విక్రయిస్తున్న వారిపై దేశ ద్రోహం కేసులు పెట్టాలని తీర్మానించారు. వీటిని కాపాడుకోవాల్సి న బాధ్యత ఉద్యోగులు, ప్రజలపై ఉందని పలు వురు పేర్కొన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఐటీ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శంకరరావు, ఎ.జగన్‌మోహనరావు, కె.సురేష్, ఏఐఎఫ్‌టీయూ నాయకులు బెహరా శంకరరావు, రైతు సంఘం నాయకుడు బి.రాంబాబు, ఇతర సంఘాల నాయకులు రెడ్డి శంకరరావు, రవికుమార్, కె.గురుమూర్తి, అప్పలరాజు, గౌరినాయుడు, కె.ఆదినారాయణ, పాపారావు, రమణ, హరీష్, జగన్మోహన్ పాల్గొన్నారు.