
రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు
బొబ్బిలి: పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో మూడు నియోజకవర్గాల రహదారుల మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ రాజ్ ఈఈ టీవీ రమణమూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో 2, రాజాంలో 2, గజపతినగరంలో 3 రహదారుల మరమ్మతులు చేసేందుకు నాబార్డ్ నిధులు రూ.12.87 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ రహదారులకు సంబంధించి త్వరలోనే ఆన్‌లైన్ టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. అలాగే మూడు నియోజకవర్గాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.109 కోట్లతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ పనుల్లో ఇప్పటికే రూ.60 కోట్ల విలువైన 1046 పనులు పూర్తయ్యాయని, వాటికి రూ.10 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు టీఎల్‌ఎం కిట్లు
పార్వతీపురం: ప్రత్యేక అవసరాల పిల్లలకు టీఎల్‌ఎం కిట్లను సెంటర్ ఫర్ రిహ్యాబిలిటేషన్ కౌన్సిల్, నెల్లూరు సంస్థ అందించినట్లు ఇన్‌చార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి డి.రమాజ్యోతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక అవసరాల కేంద్రంలో ఇంటలెక్చువల్ డిజేబులిటి (మేధో వైకల్యం) కేటరిగిలో 13మంది ఎస్టీ కమ్యూనిటీకి చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలకు రూ.1.30లక్షల విలువచేసే టీఎల్‌ఎం కిట్లను ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆమె అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు అవసరమైన కిట్లు అందించేందుకు నెల్లూరులోని స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. టీఎల్‌ఎం కిట్లును సద్వినియోగం చేసుకునేలా ఐఈఆర్‌పీలు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీసీ రెడ్డి తేజేశ్వరరావు, సెక్టోరియల్ అధికారి మధుకిషోర్, జిల్లా సహిత విద్య కోఆర్డినేటర్ భానుమూర్తి, ఐఈఆర్‌పీలు పాల్గొన్నారు.
సారాతో ఇద్దరి అరెస్ట్
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం ప్రొహిబిషన్/ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామం వద్ద సారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసి వారి నుంచి 22 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. అక్రమంగా సారా అమ్మకాలను నిరోధించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తమ సిబ్బంది దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా సారా తయారీ, రవాణా, అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి సంఘటనలు గ్రామాల్లో జరిగినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై ఆర్.చంద్రకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: ఉద్యోగావకాశాలు లభించే సాఫ్ట్‌వేర్ డెవలపర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సుల శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని వీటీఅగ్రహారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ టీవీ గిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చే ఈ కోర్సులకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఆపై చదువుకున్న వారంతా అర్హులేనని, 35 ఏళ్ల వయసులోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోపు క్యూఆర్ కోడ్ ద్వారా పేర్లను నమోదు చేసుకొని ఆధార్ కార్డు, 2 ఫొటోలతో నేరుగా స్థానిక ఐటీఐ కళాశాలకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 7780658035 నంబరును సంప్రదించాలని సూచించారు.

రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు

రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు