ప్రకృతి వైపరీత్యాలతో ఆందోళన చెందవద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వైపరీత్యాలతో ఆందోళన చెందవద్దు

May 3 2025 8:35 AM | Updated on May 3 2025 8:39 AM

జాగ్రత్తలు పాటిస్తే ముప్పు నుంచి

తప్పించుకోవచ్చు

అవగాహన కల్పించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌

బృందాలు

మక్కువ: ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రజలకు అవగాహన కల్పించాయి. ఈ మేరకు మక్కువ మండలంలోని వెంకట భైరిపురం జిల్లా పరిషత్‌ పాఠశాలలో శుక్రవారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు, తహసీల్దార్‌ షేక్‌ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ బృందం సభ్యులు ప్రకృతి వైపరీత్యాల్లో ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. వెంకటభైరిపురం గ్రామం సమీపంలో కొత్తవలస ఆనకట్టపై వరద ఉధృతి వచ్చేటప్పుడు, ఏ విధమైన చర్యలు చేపట్టాలో ఆనకట్టు నీటిలో ప్రాక్టికల్స్‌ నిర్వహించారు. వెంకట భైరిపురం హైస్కూల్‌లో ఫైర్‌ బ్రిగేడియర్‌ ఆపరేషన్‌పై, భూకంపాలు వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అకస్మికంగా గ్యాస్‌ లీక్‌ అయితే, ఏ విధంగా మంటలను అదుపు చేయాలో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ, వైద్యశాఖ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రకృతి వైపరీత్యాలతో ఆందోళన చెందవద్దు1
1/2

ప్రకృతి వైపరీత్యాలతో ఆందోళన చెందవద్దు

ప్రకృతి వైపరీత్యాలతో ఆందోళన చెందవద్దు2
2/2

ప్రకృతి వైపరీత్యాలతో ఆందోళన చెందవద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement