
సమస్యల పరిష్కారం, సంక్షేమానికి ప్రాధాన్యం
పార్వతీపురం రూరల్: పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి చర్యలు చేపడతామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన కార్యాలయంలో ‘పోలీస్ వెల్ఫేర్ డే’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ముఖ్య ప్రాధాన్యం ఇస్తూ సిబ్బంది వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్‌న్స్–డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది పాల్గొని వారి సమస్యలను తనకు నేరుగా తెలియజేయాలని ఎస్పీ కోరారు. వచ్చిన సమస్యలను కూలంకుషంగా విని, విన్నపాలను పరిశీలించి సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సీసీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి