
అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న శిబిరాలపై పెద్దఎత్తున దాడి నిర్వహించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం, సారా తయారీని నివారించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్న ఎకై ్సజ్ శాఖ, ఒడిశా ఎకై ్సజ్ అధికారులతో కలిసి గురువారం బందుగాం బ్లాక్ లోని అత్తిగుడ, చైన బంకిడి, ఎగువబద్ద గ్రామాల్లో ఏకకాలంలో పెద్ద ఎత్తున దాడి చేశామన్నారు. ఈ దాడిలో 10,800 లీటర్ల ఎఫ్‌జే వాష్, 40 లీటర్ల ఐడీ లిక్కర్, 200 కిలోల బ్లాక్ జాగరి, 40 కిలోల అమ్మోనియాను పట్టుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అక్రమ మద్యం తయారీకి సంబంధించిన క్రాస్–బోర్డర్ కార్యకలాపాల గురించి ఇంటెలిజెన్‌న్స్ సమాచారం ఆధారంగా ఈ రైడ్ నిర్వహించామని, ఈ పదార్థాల నుంచి ప్రమాదకరమైన నకిలీ మద్యం తయారు చేసి ప్రాణనష్టానికి కారకులవుతున్నారన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మరింత విజిలెన్‌న్స్ పెంచి, అక్రమ మద్యం తయారీని పూర్తిగా నిర్మూలించడానికి సంయుక్త ఆపరేషన్లు కొనసాగిస్తామని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, సాలూరు ఎస్‌హెచ్‌ఓ బృందాలు, బీఎంపీపీ సాలూరు, ఈఎస్‌టీఎఫ్ విజయనగరం, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు మొత్తం 27 మంది పాల్గొన్నట్లు తెలిపారు.