
కూరగాయల రైతు కుదేలు
రామభద్రపురం:
రైతన్నకు గడ్డు పరిస్థితి. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదు. కనీసం పంట కోత, తరలింపు ఖర్చులు రావడం లేదు. ఏ రకం కూరగాయలు తీసుకెళ్లినా కిలో రూ.5 చొప్పున ధర పలుకుతుండడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకునేవారు లేక కన్నీరు పెడుతున్నారు. కష్టకాలం ఆరంభమైందంటూ నిట్టూర్చుతున్నారు.
పడిపోయిన ధరలు
సాధారణంగా శుభకార్యాలు జరిగే సీజన్‌లో కూరగాయలకు గిరాకీ ఉంటుంది. కానీ ఈ ఏడాది పంటను కొనుగోలు చేసేవారే కరువయ్యారు. రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసేవారికోసం రైతులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఊహించని రీతిలో ధరలు పతనం కావడంతో లబోదిబోమంటునారు. వంగ, చిక్కుడు, బెండ, క్యాబేజీ, దొండ వంటి కూరగాయలతో పాటు బంతి, కనకాంబరాలు తదితర పూలకు గిట్టుబాటు ధర లేదు. 20 కిలోల బరువు ఉన్న క్రేట్ ధర రూ.200 లోపే పలుకుతోంది. సగటున సరాసరి కిలో రూ.5లు నుంచి రూ.10ల మధ్యలో ధర ఉంది. ఎకరం పంట సాగుకు కోతకు వచ్చే వరకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అయ్యింది. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో పంట పెట్టుబడిని పక్కనపెడితే పంటను కోసేందుకు, మార్కెట్‌కు తరలించే ఖర్చులు కూడా రావడం లేదు. కొందరు రైతులు పంటను కోయకుండానే వదిలేస్తున్నారు.
చంద్రబాబుకు పట్టని అన్నదాత గోడు
రైతన్న గోడు సీఎం చంద్రబాబుకు పట్టడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంటలకు మద్దతు ధర కల్పనకు చొరవ చూపడం లేదు. విపత్తుల సమయంలో పంటలు నష్టపోయిన రైతన్నకు పరిహారం అందడం లేదు. సంబంధిత మంత్రి వ్యవసాయం దండగంటూ ప్రకటనలు చేయడం కర్షకుడిని ఆవేదనకు గురిచేస్తోంది. గత ఐదేళ్లూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పీఎం కిసాన్‌తో కలిపి ఏటా వైఎస్సార్ భరోసా కింద రైతు కుటుంబానికి రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించేది. ఉచిత పంటల బీమాతో సాగుధీమా కల్పించేది. విపత్తుల సమయంలో ఆదుకునేది. ఆర్‌బీకేల నుంచి రైతన్నకు సాయం అందించేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడం రైతులు కాడి విడిచి కూలిపనులకు వెళ్లే పరిస్థితులు నెలకున్నాయి.
● అప్పు చేసి కూలీలకు ఇస్తున్నాం..
నేను 20 సెంట్ల విస్తీర్ణంలో చిక్కుడు పంట సాగు చేశాను. కాపుకొచ్చిన చిక్కుడు చూసి ఆనందించాలో, గిట్టుబాటు ధర లభించడం లేదని బాధపడాలో తెలియడం లేదు. పండిన పంట మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్మితే కూలీలకు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. కూలీలకు, పురుగు మందులు, ఎరువుల కొనుగోలుకు అప్పు చేయాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.
– బూరుగు కృష్ణ, రైతు, బూసాయవలస
● పెట్టుబడి రావడం లేదు..
మార్కెట్లో 20 కిలోల వంకాయలు రూ.150 నుంచి రూ.180ల మధ్యలో అడుగుతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలా నష్టపోయాం. నేను 20 సెంట్లలో వంగ పంట సాగు చేస్తున్నాను. రూ.10 వేలు ఖర్చుచేశాను. ఇప్పటి వరకు రూ.2 వేలు కూడా చేతికందలేదు. మా కుటుబం కష్టం పోయినా కనీసం సగం పెట్టుబడి డబ్బులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– చొక్కాపు పైడిపునాయుడు,
రైతు, రామభద్రపురం
● ఆదుకోండి ‘బాబూ’...
ఖరీఫ్ సీజన్‌లో వరుస తుఫాన్లు కారణంగా కూరగాలయ పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు నష్టపోయాం. ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయంలో ధర లేదు. రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తక్షణమే రైతు సుఖీభవ నిధులు విడుదల చేయాలి. మార్కెట్‌లో కూరగాయలకు ధర కల్పించే చర్యలు చేపట్టాలి.
– పూడి వెంకటరావు, రైతు, రామభద్రపురం
కూరగాయల ధర పతనం
వంగ, బెండకాయలు కిలో రూ.5
కూలి ఖర్చులు రాని వైనం
అందని అన్నదాత సుఖీభవ
రైతుగోడు వినిపించుకోని చంద్రబాబు
ఆవేదనలో సాగుదారులు

కూరగాయల రైతు కుదేలు

కూరగాయల రైతు కుదేలు

కూరగాయల రైతు కుదేలు

కూరగాయల రైతు కుదేలు

కూరగాయల రైతు కుదేలు

కూరగాయల రైతు కుదేలు

కూరగాయల రైతు కుదేలు