రైల్వేస్టేషన్‌లో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో నిందితుడి అరెస్ట్‌

May 1 2025 1:20 AM | Updated on May 1 2025 1:20 AM

రైల్వ

రైల్వేస్టేషన్‌లో నిందితుడి అరెస్ట్‌

విజయనగరం క్రైమ్‌: స్థానిక రైల్వేస్టేషన్‌లో సెల్‌ఫోన్‌ అపహరించి వెళ్లిపోతున్న వ్యక్తిని జీఆర్పీ సిబ్బంది బుధవారం అరెస్ట్‌ చేశారు. విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తన సిబ్బందితో కలిసి విజయనగరం రైల్వే స్టేషన్‌లో తని ఖీ చేస్తుండగా ప్లాట్‌ఫాంపై ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో పట్టుకుని వి చారణ చేశారు. ఈ విచారణలో విజయనగరంలోని లంకాపట్నానికి చెందిన పొట్నూరు వెంకటేష్‌ అలియాస్‌ విక్కీ(27) రూ.25 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ను అపహరించినట్లు గుర్తించా రు. వెంటనే జీఆర్పీ ఎస్సై బాలాజీ కేసు నమో దు చేసి నిందితుడి దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని విశాఖ రైల్వేకోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించింది.

10 లీటర్ల సారా పట్టివేత

నెల్లిమర్ల: నవోద యం 2.0లో భాగంగా నెల్లిమర్ల ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం వెంకటరావు ఆధ్వర్యంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు, సిబ్బందితో గుర్ల మండలంలోని దేవుని కణపాకలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి అచ్చాలు తాలుకా ఖాళీస్థలంలో 10 లీటర్ల సారా పట్టుబడింది. నిందిత వ్యక్తి పరారీలో ఉన్నందున కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. దాడుల్లో హెచ్‌సీలు ఎం.అప్పారావు, పీసీలు డీకే శంకర్‌, కె.సీతాలక్ష్మి పాల్గొన్నారు.

వృద్ధుడి అదృశ్యం

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి మండలంలోని తోండ్రంగి గ్రామానికి చెందిన పిల్ల అప్పలనాయుడు (75) గడిచిన 20 రోజులుగా కనిపించడం లేదని భార్య పిల్ల పైడమ్మ, కుటుంబసభ్యులు తెలిపారు. ఏప్రిల్‌ 9న గ్రామం నుంచి బయటకు వెళ్లిన ఆయన మళ్లీ ఇంటికి రాలేదని, ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదని, ఇదే విషయం పోలీస్‌స్టేషన్‌కు కూడా సమాచారం అందించామని చెప్పారు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌ 8374474305, 8187035696 నంబర్లకు సమాచారం తెలియజేయాలని కోరారు.

ఐదుగురిపై దాడి కేసు నమోదు

సంతకవిటి: మండలంలోని కొండగూడెం గ్రామంలో తాడి పార్వతిపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు ఈ నెల 25 న దాడి చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ఎం.వాసుదేవరావు తెలిపారు. ఏఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పార్వతిపై శుక్రవారం రాత్రి గ్రామస్థులు దాడి చేయడంతో గ్రామంలో పెద్దల వద్దకు వెళ్లారు. అక్కడ ఎటువంటి న్యాయం జరగక పోవడంతో బుధవారం జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

600 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం

సీతంపేట: మండలంలోని చిన్నబెత్తుపురం పరిసర ప్రాంతాల్లో ఎస్సై వై.అమ్మన్నరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేసి సారా వండడానికి సిద్ధం చేసి దాచిన 600 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. సారా వండినా, విక్రయించినా, అక్రమరవాణా చేసినా చర్యలు తప్పవని ఎస్సై అమ్మన్నరావు ఈ సందర్భంగా హెచ్చరించారు.

పసుకుడి చేరిన ఏనుగుల గుంపు

భామిని: ఒడిశా వెళ్లిన ఏనుగుల గుంపు తిరిగి ఆంధ్రా చేరింది. బుధవారం భామిని మండలం పసుకుడి తీరంలో నాలుగు ఏనుగులు రైతుల పంట చేలలో అలజడి సృష్టించాయి. ఒడిశా గ్రామాల మీదుగా ఏనుగుల గుంపు ప్రయాణించడానికి ఆటంకంగా భావించిన ఒడిశా పారెస్ట్‌ అధికారులు, ట్రాకర్స్‌ ఆంధ్రా వైపు రాత్రిపూట వెళ్లగొడుతున్నారని స్థానిక రైతులు వాపోతున్నారు. ఒడిశా గ్రామాల్లో రాత్రి పూట కరెంట్‌ తీసివేసి ఏనుగుల గుంపును వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వేస్టేషన్‌లో నిందితుడి అరెస్ట్‌1
1/2

రైల్వేస్టేషన్‌లో నిందితుడి అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో నిందితుడి అరెస్ట్‌2
2/2

రైల్వేస్టేషన్‌లో నిందితుడి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement