
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో వ్యక్తికి గాయాలు
వంగర: మండల పరిధి అరసాడ జంక్షన్ వద్ద విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో బుధవారం ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మగ్గూరు గ్రామానికి చెందిన రొంగలి సత్యనారాయణ జంక్షన్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే పనిలో ఉండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్‌సర్క్యూట్‌కు గురయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న 108 వాహన సిబ్బంది బాధితుడిని రాజాం సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
తేనెటీగల దాడి: ఏడుగురికి గాయాలు
వంగర: మండల పరిధి శివ్వాంలో బుధవారం పెళ్లి జరుగుతున్న సమయంలో తేనెటీగలు దాడిచేయడంతో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. పెళ్లికుమార్తెను గ్రామ సమీపంలోని ఓ చెట్టు వద్ద నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. అంతలో తేనెటీగల పట్టు చెదిరిపోవడంతో అక్కడ ఉన్న బిల్లాన రామారావు, అలజింగి ప్రేమ్‌కుమార్, బిల్లాన ప్రతాప్, కుప్పిలి నితిన్, కిరణ్‌తోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారందరినీ వంగర పీహెచ్‌సీకి తరలించగా వైద్యురాలు సీహెచ్‌జ్యోతి ప్రథమ చికిత్స అందించారు. బాధితులంతా శివ్వాం గ్రామస్తులే.
తాటిచెట్టు పైనుంచి జారిపడి వ్యక్తికి గాయాలు
వంగర: మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన దమరసింగి పైడియ్య తాటిచెట్టుపై నుంచి జారిపడి గాయపడ్డాడు. బుధవారం గ్రామ సమీపంలోని తాటి చెట్టు ఎక్కి తాటికాయలు దింపేందుకు వెళ్లాడు. తాటికాయల గెల తీస్తుండగా అదుపు తప్పి కిందపడిపోవడంతో ఎడమ చేయి సోల్డర్ జారిపోగా, పక్కటెముకకు తీవ్రంగా గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు రాజాంలో చికిత్స పొందుతున్నాడు.

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో వ్యక్తికి గాయాలు