
జెడ్పీలో అగ్నిప్రమాదం
● రెండు
కంప్యూటర్లు దగ్ధం
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. షాట్ సర్క్యూట్ కారణంగా జెడ్పీలోని ఇంజనీరింగ్ విభాగంలో రెండు కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. జెడ్పీలో పని చేస్తున్న సిబ్బంది సత్యనారాయణ వెంటనే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేయడంతో హుటాహుటిన శకటంతో సిబ్బంది వచ్చి జెడ్పీలో తగలబడుతున్న కంప్యూటర్‌లను అర్పేయత్నం చేశారు. దాదాపు మూడు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదం కారణంగా రూ.లక్షా 90 వేల నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సహాయ అధికారి సోమేశ్వరరావు చెప్పారు.