
భక్తుల దుర్మరణం దురదృష్టకరం
విజయనగరం అర్బన్: సింహాచలం చందోత్సవానికి వచ్చిన ఏడుగురు భక్తుల దుర్మరణం దురదృష్టకరమని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. సింహాద్రి అప్పన్న దర్శనార్థం వచ్చిన భక్తులు గోడకూలి మృత్యువాత పడడం విచారకరమన్నారు. వారి కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని వారికి అవసరమైన సహాయ సహకారాలందించాలని డాక్టర్ శంకరరావు కోరారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు