
ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం
బొండపల్లి: ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారానే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.మురళి పెర్కొన్నారు. ఈ మేరకు బొండపల్లి మండలకేంద్రంలో మూడు రోజుల పాటు శ్రీరామచంద్ర మిషన్, హార్ట్‌వెల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా ,ధ్యానం శిక్షణ తరగతుల్లో భాగంగా చివరిరోజు బుధవారం ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి మురళి మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. అనారోగ్యం నుంచి బయట పడాలంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు జేఎస్‌ఎన్.రాజు, జె.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.